విద్యుత్ బిల్లుల అంశంపై స్పందించిన ఎమ్మెల్యే గంటా!
ఏపీలో విద్యుత్ బిల్లుల విషయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించారు.
ఏపీలో విద్యుత్ బిల్లుల విషయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించారు. నూతనంగా అమలులోకి తెచ్చిన *డైనమిక్* విధానం వల్ల విద్యుత్ బిల్లులు ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయని.. అసలే రెండు నెలలులుగా ఉపాధి, ఆదాయం లేని సగటు ఆంధ్రా పౌరుడు ఆ బిల్లులని చెల్లించే స్థితిలో లేక దిక్కుతోచని పరిస్తితుల్లోకి వెళుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో సగటు వినియోగదారునిగా వాళ్ళ బాధని ఆలకించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు మూడు నెలల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు గంటా.
అంతేకాదు దీన్ని కూడా విపత్తులో భాగంగానే చూడాలని.. విపత్తు నిర్వహణ నిధులనుంచి వాళ్ళను ఆదుకునే ఆలోచన చేయాలనీ పేర్కొన్నారు. కాగా విద్యుత్ బిల్లులపై తెలుగుదేశం పార్టీ నేతలు ఇళ్లలోనే ఉంటూ నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీ ఎమ్మెల్యే మాత్రం ఈ విషయంలో సుతిమెత్తగా వ్యవహరించడం టీడీపీ నేతలకు నచ్చడం లేదు. గంటా శ్రీనివాసరావు కూడా కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్నారన్న సంగతి తెలిసిందే.