Ganja Seized at Andhra Pradesh : కేడీ పేట వద్ద 1,200ల కిలోల గంజాయి పట్టివేత
Ganja Seized at Andhra Pradesh: ఎన్ని గంజాయి తోటలు నాశనం చేసినా, ఎన్ని వాహనాల్లో పట్టుకున్నా రోజూ ఎక్కడోచోట గంజాయి రవాణా అవుతుందనే దానికి ఇదే నిదర్శనం.
Ganja Seized at Andhra Pradesh: ఎన్ని గంజాయి తోటలు నాశనం చేసినా, ఎన్ని వాహనాల్లో పట్టుకున్నా రోజూ ఎక్కడోచోట గంజాయి రవాణా అవుతుందనే దానికి ఇదే నిదర్శనం. కేవలం లారీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలో 1,200 కిలోల గంజాయిని తరలిస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీటిని పట్టుకునేందుకు పోలీసు, ఎక్సైజ్, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ విభాగాలు పనిచేస్తున్నా దీనిని పూర్తిస్థాయిలో కట్టడి చేయలేక పోతున్నారు. ప్రధానంగా ఏజెన్సీలో మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులు ఇదే సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. పోలీసు అధికారులు వీటిని తొలగించేందుకు ప్రధాన రోడ్డకు అనుకుని ఉన్న ప్రాంతాలనే ఎంపిక చేసుకుంటారు. అందువల్ల వేల ఎకరాల్లో తోటలు నాశనం చేసినట్టు అధికారులు ప్రకటించుకున్నా నిత్యం గంజాయి రవాణా అవుతూనే ఉంటుంది.
విశాఖ ఏజెన్సీ ప్రాంతం ధారకొండ నుంచి ఇతర రాష్ట్రాలకు లారీలో తరలిస్తున్న 1,200 కిలోల గంజాయిని కేడీపేట పోలీసులు పట్టుకున్నారు. గొలుగొండ మండలం లింగంపేట వద్ద రోజు వారీ విధుల్లో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తుండగా గంజాయితో రవాణా అవుతున్న లారీని పట్టుకున్నారు. పోలీసుల తనిఖీలను గుర్తించిన ఇద్దరు వ్యక్తులు పరారీ కాగా, మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. దీనిలో తనఖీ చేసి చూడగా 1,200 కిలోల గంజాయి మూటలను గుర్తించారు. వీటి విలువ రూ. 60 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి , 2 సెల్ ఫోన్లు, లారీ స్వాధీనం తీసుకున్నామని కేడీపేట ఎస్ ఐ భీమరాజు విలేకరులకు చెప్పారు.