Krishna District: గాజుల రత్నభాస్కర్ మృతదేహం లభ్యం..
Krishna District: రత్నభాస్కర్‌ను హత్య చేసినట్టు పోలీసుల అనుమానం
Krishna District: కృష్ణా జిల్లా పెనమలూరు వద్ద కెనాల్‌లో పడి గల్లంతైన వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు. మృతి చెందిన వ్యక్తిని గాజుల రత్నభాస్కర్‌గా పోలీసులు గుర్తించారు. ఇంట్లో పనిచేసే వ్యక్తి రత్నభాస్కర్‌ను గుర్తుపట్టినట్లు పోలీసులు తెలిపారు. రత్నభాస్కర్ మెడ, ఒంటిపై గాయాలు ఉన్నాయి. రత్నభాస్కర్‌ను హత్య చేసినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.