నేటి నుంచి ఏపీలో ఉచిత ఇసుక విధానం.. విధివిధానాలు ఖరారు

Free Sand Supply: ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత ఇసుక సరఫరాకు సంబంధించి విధి విధానాలు ఇవాళ ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Update: 2024-07-08 04:57 GMT

నేటి నుంచి ఏపీలో ఉచిత ఇసుక విధానం.. విధివిధానాలు ఖరారు

Free Sand Supply: ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత ఇసుక సరఫరాకు సంబంధించి విధి విధానాలు ఇవాళ ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డంపింగ్ యార్డ్‌లో నిల్వ ఉన్న ఇసుకను నేటి నుంచి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం తర్వాత పూర్తిస్థాయిలో ఉత్తర్వులు వచ్చే ఛాన్స్ ఉందని అధికార వర్గాలు తెలిపాయి. అర్హులైన అందరికీ ఏపీ ప్రభుత్వం ఉచిత ఇసుకను సరఫరా చేయనుంది. అయితే ఇసుక తవ్వకాల కోసం సినరేజ్ ఛార్జీలు మాత్రమే నామమాత్రంగా వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఉచిత ఇసుక పంపిణీ పారదర్శకంగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. పూర్తిస్థాయిలో విధివిధానాల తర్వాత ఉచిత ఇసుక పంపిణీపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

టిడ్కో ఇళ్ల విషయంలోనూ ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో వైసీపీ ప్రభుత్వంలో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోతున్నట్లు తెలుస్తోంది. 2 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు హడ్కో ఒప్పుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News