Andhra Pradesh: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురి మృతి
Andhra Pradesh: అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదం 4గురు మృతి చెందారు.
Andhra Pradesh: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పెనుగొండ మండలం ఎర్రమంచి సమీపంలోని కియా కార్ల ఫ్యాక్టరీ దగ్గర ఓ కారు.. గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా బెంగళూరులోని యశ్వంత్‌పూర్‌కు చెందినవారుగా గుర్తించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.