Foundation of Ambedkar statue in Vijayawada: విజయవాడలో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం!

Foundation of Ambedkar statue in Vijayawada: భారత రాజ్యాంగ రాజ్యాంగ శిల్పి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ఏర్పాటు..

Update: 2020-07-07 15:00 GMT
Foundation of Ambedkar statue in Vijayawada

Foundation of Ambedkar statue in Vijayawada: భారత రాజ్యాంగ రాజ్యాంగ శిల్పి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేయనునట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినెపే విశ్వరూప్ వెల్లడించారు. ఈ మేరకు స్వరాజ్ మైదానంలో 20 ఎకరాల విస్తీర్ణంలో విగ్రహంతో పాటు, మెమోరియల్ పార్క్, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన భూమిని సాంఘిక సంక్షేమ శాఖకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా అయన వెల్లడించారు. ఇక విగ్రహంతో పాటుగా మెమోరియల్‌ హాలు, మెమోరియల్‌ లైబ్రరీ, స్టడీ సెంటర్, ల్యాండ్‌ స్కేపింగ్, గార్డెన్‌ ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

ఇక ఈ విగ్రహానికి బుధవారం (జూలై 8వ తేదీ) సాయంత్రం 4 గంటలకు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా శంకుస్థాపన చేస్తారని అయన తెలిపారు. ఏడాదిలోపే ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తామని అయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.. అయితే ఆ పనులు ఏవీ ముందుకు సాగలేదు..

అయితే అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ తాము అధికారంలోకి వచ్చాక దీనిని వెంటనే నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అన్నట్టుగానే ఇప్పుడు నిర్మాణ పనులను మొదలుపెడుతున్నారు. ఇక అటు తెలంగాణలో కూడా ఇలాంటి విగ్రహాన్ని పెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.



Tags:    

Similar News