మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆయనతోపాటు కుమారుడు అస్మిత్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని వీరి నివాసంలో అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం వీరిని హైదరాబాద్ నుంచి అనంతపురానికి తరలిస్తున్నట్టు తెలుస్తోంది. బీఎస్ 3 వాహనాలను బీఎస్4గా రిజిస్ట్రేషన్ చేసి అమ్మకాలు సాగించినట్లు దర్యాప్తులో తేలింది. దాంతోపాటు నకిలీ పత్రాలు సృష్టించి ఇప్పటివరకు 154 వాహనాలు నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేయించినట్లు పోలీసులు గుర్తించారు.
దీంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ కేసులకు సంబంధించి తాను అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నానని ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. కాగా ఆయన తాడ్రిపత్రి మునిపాలిటీ చైర్మన్ గా, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక నిన్న ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, నేడు జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ కావడంతో టీడీపీ షాక్ లో మునిగిపోయింది. వరుసగా కీలక నేతలు అరెస్ట్ అవుతుండటంతో ఆ పార్టీకి కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు.