Paidikondala Manikyalarao tested Corona positive: ఏపీ మాజీ మంత్రి మాణిక్యాల రావుకు కరోనా పాజిటివ్

Paidikondala Manikyalarao tested Corona positive: ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కరోనావైరస్ భారిన పడ్డారు. ఆయాంకు ఇటీవల జరిపిన కోవిడ్ పరీక్షలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

Update: 2020-07-04 10:20 GMT

Paidikondala Manikyalarao tested Corona positive:   ఈ విషయాన్నీ సెల్ఫీ వీడియో ద్వారా ఆయనే స్వయంగా వెల్లడించారు. అందులో తనకు కరోనా నిర్ధారణ అయిందని.. అయితే తాను ఆరోగ్యంగానే వున్నానని కార్యకర్తలెవ్వరూ భయపడవద్దని కోరారు. అలాగే ఎవరైనా కరోనా వచ్చిందని భయపడవద్దని.. అది రాకూడని రోగం కాదని.. పైగా ప్రమాదకారి కూడా కాదన్నారు. సామాజిక దూరం పాటించకుండా ఉంటేనే కరోనా వచ్చే అవకాశం ఉందని.. ప్రజలు బస్సులు, ఇతర వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇక వైరస్ సోకిందని భయపడి టెస్టులు చేయించుకోవడం మానవద్దని పైడికొండల మాణిక్యాలరావు ప్రజలకు సూచించారు.

కాగా మాణిక్యాలరావు 2014 ఎన్నికల్లో తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి.. బీజేపీ , టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తరువాత అధికారంలోకి రావడంతో చంద్రబాబు మంత్రివర్గంలో దేవాదాయధర్మాదాయ శాఖా మంత్రిగా నాలుగేళ్లపాటు ఉన్నారు. ఏపీబీజేపీలో చురుకైన నాయకుడిగా ఆయనకు పేరుంది. మరోవైపు వైసీపీకి చెందిన గుంటూరు జిల్లా పొన్నూరు శాసనసభ్యుడు కిలారు రోశయ్యకు కూడా కరోనావైరస్ నిర్ధారణ అయింది. ఆయన గత వారం రోజులుగా గృహనిర్బంధంలో ఉన్నారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని..ప్రజలకు ఫోన్ ద్వారా అందుబాటులో ఉంటానని వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఇదిలావుంటే ఏపీలో శనివారం 727 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

x

Tags:    

Similar News