Dadi Veerabhadrarao: వైసీపీకి షాక్.. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజీనామా

Dadi Veerabhadrarao: వైసీపీలో ప్రాధాన్యత లేదని పార్టీ సభ్యత్వానికి రాజీనామా

Update: 2024-01-02 10:15 GMT

Dadi Veerabhadrarao: వైసీపీకి షాక్.. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజీనామా 

Dadi Veerabhadrarao: ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేతలు పార్టీకి గుడ్‌బై‌లు చెబుతోన్న వేళ.. ఆ జాబితాలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా చేరారు. సీఎం జగన్‌కు తన రాజీనామా లేఖ పంపారు దాడి వీరభద్రరావు. తన అనుచరులతో కలిసి పార్టీని వీడుతున్నట్లు ఏకవాక్యంతో లేఖ రాశారు. వీరభద్రరావుతో పాటు ఆయన కుటుంబసభ్యులు కూడా పార్టీకి రాజీనామా చేశారు. కొద్దికాలంగా దాడి వీరభద్రరావు, మంత్రి అమర్‌నాథ్‌ మధ్య విబేధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తనకు వైసీపీలో ప్రాధాన్యత లేదని పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు దాడి వీరభద్రరావు. త్వరలోనే ఆయన పవన్ కల్యాన్ సమక్షంలో జనసేనలో చేరే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News