విశాఖలో భారీగా బయటపడ్డ విదేశి సిగరెట్లు.. రూ.27లక్షల సరుకు స్వాధీనం
Visakhapatnam: సరుకు చెన్నై నుండి దిగుమతి చేసుకున్నట్లు గుర్తించిన విజిలెన్స్ అధికారులు
Visakhapatnam: విశాఖలో విదేశీ సిగరెట్లు భారీగా బయటపడ్డాయి. నాలుగు షాపులపై దాడి చేసి 27లక్షల విలువైన సరుకును విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విక్రయదారులు ఈ సరుకును చెన్నై నుండి దిగుమతి చేసుకున్నారు. సిగరెట్లు బాక్స్‌లపై విదేశి బ్రాండ్స్ పేరు ఉన్నా...అవి విదేశీ బ్రాండ్లా కాదా తేలాల్సి ఉందని విజిలెన్స్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. నికోటిన్ శాతం పెంచి సిగరెట్ల విక్రయాలు చేస్తున్నారంటున్న అడిషనల్ ఎస్పీ స్వరూప రాణి.