Ganavaram: గన్నవరం ఎయిర్‌పోర్టును కమ్మేసిన పొగమంచు
Ganavaram: విమానాల ల్యాండింగ్‌కు తీవ్ర ఇబ్బందులు
Ganavaram: గన్నవరం ఎయిర్‌పోర్టును దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో విమానాల ల్యాండింగ్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పొగమంచు కారణంగా గాల్లో మూడు విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఢిల్లీ నుంచి విజయవాడకు వెళ్లున్న ఎయిర్ ఇండియా విమానంతో పాటు బెంగళూరు నుంచి విజయవాడ వెళ్లున్న ఇండిగో విమానం, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఇండిగో విమానాలు గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.