శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి.. మంటలు చెలరేగి ఆలయ పందిరి దగ్ధం..!

Sri Rama Navami: శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది.

Update: 2023-03-30 08:15 GMT

శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి.. మంటలు చెలరేగి ఆలయ పందిరి దగ్ధం..!

Sri Rama Navami: శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా దువ్వ గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయం శ్రీరామనవమి వేడుకలు పురస్కరించుకొని పందిళ్లు ఏర్పాటు చేశారు. ప్రమాదవశాత్తు పందిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరు గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిమపక సిబ్బంది మంటలు అదుపుచేశారు. వేణుగోపాల స్వామి వారి మహోత్సవాలు పురస్కరించుకుని గత నెలలో ఆలయంలో తాటాకు పందిరి వేశారు. శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి ఎదురు సన్నాహం చేపట్టిన సందర్భంలో తారాజువ్వలు వేశారని.. అవి పందిరిపై పడటంతో మంటలు చెలరేగి ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News