Fire Accident in Vijayawada: విజయవాడ హోటల్ లో అగ్ని ప్రమాదం..

Fire Accident in Vijayawada: విజయవాడ కోవిద్ ఆస్పత్రి నిర్వహించే ఒక ప్రైవేటు హోటల్ లో ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది.

Update: 2020-08-09 02:55 GMT
Fire Accident

Fire Accident in Vijayawada: విజయవాడ కవిడ్ ఆస్పత్రి నిర్వహించే ఒక ప్రైవేటు హోటల్ లో ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కోవిడ్‌కేర్‌ సెంటర్‌గా ఉపయోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హోటల్లో 50 మంది కరోనా పేషెంట్లకు ప్రభుత్వం చికిత్స అందిస్తోంది.

ప్రమాదం జరిగిన వెంటనే హోటల్‌ సిబ్బంది అలర్ట్‌ కావడంతో ప్రాణనష్టం తప్పింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు విస్తృతంగా వ్యాపించాయి. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మంటలను అదుపు చేసేందుకు ఫైర్‌ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాగా ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 


Tags:    

Similar News