Fire Accident: సింహాచలం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం
Fire Accident: సింహాచలం విద్యుత్ సబ్‌స్టేషన్‌లోని ట్రాన్స్‌ఫార్మర్లు ఒక్కసారిగా పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి
Fire Accident: విశాఖనగరంలోని సింహాచలంలో ఉన్న ట్రాన్స్ కో విద్యుత్ సబ్ స్టేషన్ లో 10/16 ట్రాన్స్ ఫార్మర్ లో మంటలు చెలరేగాయి. గురువారం తెల్లవారుజామున సబ్‌స్టేషన్‌లోని ట్రాన్స్‌ఫార్మర్లు ఒక్కసారిగా పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో సబ్ స్టేషన్ లోని మిగిలిన ట్రాన్స్ ఫార్మర్లకు మంటలు వ్యాపించకుండా ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో రాత్రిపూట విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మూడు ఫైరింజన్ల తో అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
అధిక ఉష్ణోగ్రతల వల్లే సబ్‌స్టేషన్‌లో మంటలు చెలరేగాయని ట్రాన్స్‌కో డీఈ చెప్పారు. ప్రస్తుతం విద్యుత్‌ను పునరుద్దరించినట్లు తెలిపారు. ప్రమాదానికి గురైన ట్రాన్స్ ఫార్మర్ 25 ఏళ్ల నాడు ఏర్పాటు చేసిందని అధికారులు తెలిపారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత మిగిలిన ట్రాన్స్ ఫార్మర్ల నుంచి సబ్ స్టేషన్ ద్వారా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని ఈపీడీసీఎల్ ఎస్ ఈ తెలిపారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగి వుంటుందని, నష్టాన్ని అంచనా వేయడానికి అధికారుల బృందం దర్యాప్తు చేసి నిర్ధారిస్తుందిన తెలిపారు.