East Godavari: బాణాసంచా పేలడంతో పెట్రోల్ బంక్‌లోనూ పేలుడు.. పక్కనే ఉన్న రైస్ మిల్ స్వల్పంగా ధ్వంసం
East Godavari: పేలుడు సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం
East Godavari: తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలో పెట్రోల్ బంక్ దగ్ధమైంది. తొస్సిపూడి గ్రామంలో పెట్రోల్ బంక్ పక్కన ఉన్న ఓ బాణాసంచా గోడౌన్‌లో పేలుడు సంభవించింది. దాంతో ఆ మంటలు బంక్‌కు వ్యాపించడంతో పెట్రోల్ బంక్‌లో కూడా పేలుడు సంభవించింది. బంకులో పేలుడుతో పలువురు మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. భారీగా పేలుడు సంభవించడంతో సమీపంలోని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పక్క గ్రామాల్లో కూడా ఈ పేలుడు ప్రకంపనలు సృష్టించింది.