పల్నాడు జిల్లాలో అగ్నిప్రమాదం.. ఆరు నెలల పసిపాప సజీవదహనం
Palnadu: కాపాడేందుకు వెళ్లిన మహిళకు తీవ్రగాయాలు
Palnadu Fire Accident: పల్నాడు జిల్లా పెదపాలెం ఎస్సీ కాలనీలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి వ్యాపించడంతో ఐదు గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే.. ఈ ప్రమాదంలో ఆరునెలల పసిపాప ప్రాణాలు కోల్పోయింది. గుడిసెలోని ఉయ్యాలలో ఉన్న పాప మంటల ధాటికి సజీవదహనమైంది. పాపను కాపాడేందుకు ప్రయత్నించినా అమ్మమ్మ మేరీకి తీవ్రగాయాలయ్యాయి. మొత్తం ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా.. వారిని సత్తెనపల్లి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. సకాలంలో స్పందించకపోవడంతోనే మంటలు భారీగా వ్యాపించాయని బాధితులు ఆరోపిస్తున్నారు.