Panchayat Elections: ఎన్నికలు ఏకగ్రీవం చేస్తే.. భారీ ప్రోత్సాహకం ప్రకటించిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ సమీకరణాలు మారిపోతున్నాయి.

Update: 2021-01-26 15:51 GMT

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ సమీకరణాలు మారిపోతున్నాయి. నిన్నమొన్నటి వరకూ ఎన్నికలను వ్యతిరేకించిన అధికారపార్టీ ఇప్పుడు ఎన్నికలకు సిద్ధమయింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి సహకరించేందుకు రెడీ అయింది. కొత్త షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 9, 13,17,21 తేదీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా..పంచాయతీలను ఏకగ్రీవం చేసే దిశగా ప్రోత్సహిస్తోంది. పంచాయతీలో ఏకగ్రీవాలు చేస్తే వారికి ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

.ఏకగ్రీవాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. నాలుగు కెటగిరిలుగా విభజించింది. గ్రామాల్లో సహృద్భావ వాతావరణం నెలకొనేందుకు ప్రోత్సాహకలు ప్రకటిస్తున్నట్లు స్సష్టం చేసింది. 2వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు 5లక్షల రూపాలయలు ప్రోత్సాహకం అందిస్తామని వెల్లడించింది. 2వేల నుంచి 5వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు 10లక్షలు రూపాయలు, మూడో కెటగిరి కింద 5వేల నుంచి 10వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు 15లక్షలు రూపాయల నగదు ప్రొత్సహం ఇవ్వనుంది. అలాగే 10వేలకు పైన జనాభా ఉన్న పంచాయతీలకు 20లక్షల రూపాయాలు ప్రోత్సాహకం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటిచింది. .

Tags:    

Similar News