YS Jagan Selfi: వైఎస్ జగన్‌తో సెల్ఫీ...చిక్కుల్లో మహిళా హెడ్ కానిస్టేబుల్
YS Jagan Selfi: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాకు వెళ్లి మాజీ ఎంపీ నందిగం సురేశ్, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాస్ రెడ్డిని పరామర్శించారు. తర్వాత జైలు బయట మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో జైల్లో విధులు నిర్వహిస్తున్న అనంతపురం జిల్తాకు చెందిన మహిళా కానిస్టేబుల్ అయేషాబాను జగన్ దగ్గరకు వెళ్లి సెల్పీ తీసుకుంది. అంతేకాదు జగన్ కు కరచాలనం చేశారు.
అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకునేందుకు జైలు అధికారి సిద్ధమవుతున్నవారు. కానిస్టేబుల్ విధులు పక్కన పెట్టి ఇలా సెల్ఫీలు తీసుకోవడం నేరమంటూ చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ అంశంపై జైలు సూపరింటెండ్ రఘు స్పందించాల్సి ఉంది.
వైఎస్ జగన్ తో సెల్ఫీ దిగిన హెడ్ కానిస్టేబుల్ ఆయేషాది అనంతపురం జిల్లా. ఆమె కూతురితో కలిసి సెల్ఫీ తీసుకున్నారు. అక్కడ ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలో ఇలా దూసుకువచ్చి..నేను మీ అభిమానిని..అందుకే సెల్ఫీ తీసుకుంటాను అంటూ చెప్పారు.
జగన్ కూడా ఒకే అనడంతో ఇద్దర కలిసి సెల్ఫీ తీసుకున్నారు. వీధుల్లో ఉన్న సమయంలో అది కూడా జగన్ అభిమాని అనడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. ఈ సెల్ఫీ తర్వాత జైలు అధికారులు ఈ అంశంపై హెడ్ కానిస్టేబుల్ కు ఛార్జి మెమో ఇస్తామని చెబుతున్నారు.
రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన పోలీసులు ఈ విధంగా ఒక పార్టీపై, ఆ పార్టీ అధినేతపై అభిమానం పెంచుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పోనీ పార్టీపై అభిమానం ఉంటే పర్వాలేదు. కానీ విధి నిర్వహణలో ఉండి కూడా రాజకీయ నాయకులతో సెల్ఫీలేంటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకొందరు మాత్రం ఆమెది అత్యుత్సాహం అంటూ పోస్టింగ్ లు పెడుతున్నారు. మరికొందరు ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ హోంమంత్రి వంగలపూడి అనితను కూడా ట్యాగ్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.
ఇక జగన్ జైలుకు వస్తారని సిబ్బందికి సమాచారం ఉంది. అందుకే సదరు మహిళా కానిస్టేబుల్ తన కుమార్తెను కూడా జైలు వద్దకు పిలిపించారన్న ప్రచారం కూడా జరుగుతోంది. జగన్ కు జనంలో క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకునేందుకే ఇలాంటి సీన్ క్రియేట్ చేస్తున్నారని కొంతమంది కౌంటర్లు ఇస్తున్నారు.