విజయనగరం జిల్లాను కరుణించని వరుణుడు.. వర్షాలు లేక ఆగిపోయిన వరినాట్లు

Vizianagaram: నాట్లు వేయడం ఆలస్యమైతే దిగుబడి తగ్గుతుందన్న రైతన్న

Update: 2023-07-23 02:12 GMT

విజయనగరం జిల్లాను కరుణించని వరుణుడు.. వర్షాలు లేక ఆగిపోయిన వరినాట్లు 

Vizianagaram: వరుణుడు కరుణించడం లేదు. మేఘాలు దోబూచులాడుతూ ముఖం చాటేస్తున్నాయి. వర్షాల కోసం రైతున్నల ఎదురుచూపులు చూస్తున్నారు. ఖరీఫ్ పంటలకు వేళయినా ఇంకా నారు వెయ్యడంతోనే సరిపెట్టుకోవల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు రైతన్నలు. వర్షాలు కన్నెర్రజేయడంతో దిక్కతోచని స్థితిలో ఉన్న విజయనగరం జిల్లా రైతుల పరిస్థితుపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం...

విజయనగరం జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విదంగా తీవ్ర వర్షాబావంతో రైతన్నలు అల్లాడుతున్నారు. ఖరీఫ్ పై కోటి ఆశలతో సిద్ధమైనప్పటికీ వర్షాలు ఆలస్యం కావడంతో వరినాట్లు ఎప్పుడు వేసేదంటూ దిగులు చెందుతున్నారు. ఇప్పటికే వరినాట్లు ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ వర్షాలు దోబూచులాడటంతో కనీసం పోలం పనులు మొదలు పెట్టలేని పరిస్థితి నెలకోంది. తోలకరి పంటలు ఆలస్యంగా వేసినట్టయితే పంట దిగుబడి రాక పెట్టిన పెట్టుబడి నష్టపోవాల్సి వస్తుందని దిగులు చెందుతున్నారు రైతన్నలు.

వర్షాలు లేక జిల్లాలోని రిజర్వాయర్లలోనూ, చెరువులలోనూ నీరు లేని పరిస్థితి కనబడుతోంది. మరోపక్క ఈయేడాది వర్షపాతం అంతంత మాత్రమే ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్న తరుణంలోపంటలపై ఆశలు వదులుకోవడమేనా అని ఆవేదన చెందుతున్నారు రైతన్నలు. తీవ్ర వర్షాబావం వల్ల ఆలస్యంగా పంటలను వేసేందుకు సిద్ధపడినప్పటికీ పెట్టిన పెట్టుబడి వస్తుందో లేదోనన్న కలత చెందుతున్నారు రైతులు.

Tags:    

Similar News