Nellore: ఐటీ అధికారులమంటూ 12కిలోల బంగారం దోపిడీకి యత్నం

Fake IT Officers: నెల్లూరు నగరంలో పట్టపగలు దోపిడీ దొంగల ముఠా భారీ దోపిడీకి స్కెచ్ వేశారు.

Update: 2022-08-26 13:20 GMT

Nellore: ఐటీ అధికారులమంటూ 12కిలోల బంగారం దోపిడీకి యత్నం

Fake IT Officers: నెల్లూరు నగరంలో పట్టపగలు దోపిడీ దొంగల ముఠా భారీ దోపిడీకి స్కెచ్ వేశారు. ఐటీ అధికారుల మంటూ బంగారం షాపులోకి ఎంట్రీ ఇచ్చిన దొంగలు సుమారు కోటిన్నర విలువ చేసే 12 కిలోల బంగారం దోచుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఏడుగురు సభ్యుల బృందంతో కూడిన ముఠా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ బెంగళూరు నుంచి వచ్చాం షాపు తనిఖీ చేయాలంటూ లోపలకు ప్రవేసించారు. బంగారం మూఠకట్టుకుని వెళ్తున్న సమయంలో అనుమానం వచ్చిన షాపు యజమాని సునీల్, ప్రసాద్ బులియన్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులకు సమాచారం అందించారు. దోపిడి ముఠా సభ్యులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పట్టపగలో దోపిడీకి యత్నించడం వ్యాపార వర్గాల్లో కలకలం రేపింది. 

Tags:    

Similar News