పోలీసులపైనే కేసు పెట్టిన మాజీ ఎంపీ హర్షకుమార్

తనపై తప్పుడు కేసులు పెట్టిన పోలీసు, న్యాయశాఖ అధికారులపై అట్రాసిటీ చట్టం ప్రకారం రాజమండ్రి త్రీటౌన్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

Update: 2020-02-17 12:01 GMT

తనపై తప్పుడు కేసులు పెట్టిన పోలీసు, న్యాయశాఖ అధికారులపై అట్రాసిటీ చట్టం ప్రకారం రాజమండ్రి త్రీటౌన్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌.. న్యాయశాఖ అధికారులు తనను ప్రత్యర్థిగా చూశారని, న్యాయవ్యవస్థలో జవాబుదారీతనం ఉండాలని అయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతీ సోమవారం తానూ స్టేషన్ కు వెళ్లి అక్కడ సంతకం పెట్టాలని ఆదేశించారని, అంతేకాకుండా నా మీద తప్పుడు కేసు పెట్టినందుకు అట్రాసిటీ చట్టం ప్రకారం నన్ను ఇబ్బందులు పెట్టిన వారందరి మీద కంప్లైంట్ చేసానని అన్నారు.

గతంలో జ్యుడిషియల్‌ సిబ్బందిని దూషించిన ఘటనకు సంబంధించి 353, 354, 323, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. 76రోజుల తర్వాత ఆయన రాజమహేంద్రవరం రావడంతో అరెస్ట్‌ చేశారు. అయన 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ తరుపున ఎంపీగా పనిచేశారు.   

Full View


Tags:    

Similar News