ఈఎస్ఐ స్కామ్ : మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్

Update: 2020-06-12 02:55 GMT

ఈఎస్ఐ స్కాములో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడును ఏసీబీ అరెస్ట్ చేసింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయనను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆయనను ఈ ఉదయం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం సంచలనమైంది. చంద్రబాబు హయాంలో నాటి కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు అచ్చెన్నాయుడు. టెలీ హెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్స్ ఇవ్వడంలో అచ్చెన్నాయుడు ఒత్తిడి తెచ్చారని.. నామినేషన్ల పద్ధతిలో కేటాయించాలని అచ్చెన్నాయుడు ఆదేశించారని విచారణలో తేలినట్టు తెలుస్తోంది.

దీంతో అవినీతి జరిగిందని ఇందులో అచ్చెన్నాయుడు హస్తం ఉందని ఏసీబీ అధికారులు భావించి ఆయనను అరెస్ట్ చేశారు. ఈఎస్ఐ గత ఆరేళ్లలో కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని తేలింది. లేని కంపెనీల నుంచి నకిలీ కోటేషన్లు తీసుకొని ఆర్డర్లు ఇచ్చినట్టు అధికారులు గుర్తించారు. కాగా దీనిపై విచారణ చెయ్యాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఈ ఏడాది జనవరి 10న సీఎం జగన్ కు లేఖ రాయడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. 

Tags:    

Similar News