Eluru: ప్రభుత్వ హాస్పటల్లో దారుణం.. సిజేరియన్ చేశారు.. కత్తెర వదిలేశారు
Eluru: వైద్యుల తీరుపై మండిపడుతున్న బాధితురాలి బంధువులు
Eluru: ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం బట్టబయలైంది. ఓ మహిళ కడుపులో వైద్యులు కత్తెర వదిలేసి కుట్లు వేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నాలుగు నెలల క్రితం మహిళకు ఆపరేషన్ జరగగా.. ఆ సమయంలో కడుపులో కత్తెరను వదిలేసి కుట్లు వేశారు డాక్టర్లు. మహిళకు కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లగా.. కడుపులో కత్తెరను గుర్తించారు డాక్టర్లు. వైద్యుల నిర్లక్ష్యంపై బాధితురాలి బంధువులు మండిపడుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఘటనపై స్పందించారు ఆస్పత్రి అధికారులు. ఘటనపై విచారణ చేపడతామని ఆస్పత్రి సూపరింటెండెంట్ శశిధర్ అన్నారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని చెప్పారు. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందంటున్న ఆస్పత్రి సూపరింటెండెంట్ శశిధర్.