ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి ప్రాథమిక పాఠశాలలు
* క్లాస్‌రూంలో 20 మంది ఉండేలా చర్యలు * కోవిడ్ రూల్స్ పాటిస్తూ క్లాసుల నిర్వహణ
ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి ప్రాథమిక పాఠశాలలు రీఓపెన్ కానున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. 1 నుంచి 5 వరకు క్లాసులను నిర్వహించనున్నట్లు తెలిపారు. క్లాస్‌రూంలో 20 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. కోవిడ్ రూల్స్ పాటిస్తూ క్లాసుల నిర్వహణ కొనసాగించాలని ఆదేశించారు. గదులు సరిపోని చోట రోజు మార్చి రోజు క్లాసులు నిర్వహించాలన్నారు. అయితే పేరెంట్స్ లిఖితపూర్వక హామీ ఇస్తేనే స్కూళ్లకు విద్యార్థులను అనుమతి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.