రాష్ట్రంలో అన్ని పంచాయితీలలో మోగిన ఎన్నికల నగారా

* కలెక్టర్ల సూచనతో కొన్ని మార్పులు చేసిన ఈసీ * రాష్ట్ర వ్యాప్తంగా 168 మండలాలకు ఎన్నికలు * ఒంగోలు డివిజన్లో 15 మండలాల్లో ఎన్నికలు

Update: 2021-01-29 01:55 GMT

Representational Image

మరికొన్ని గంటల్లో పంచాయతీ ఎన్నికల పోరులో కీలక ఘట్టం ప్రారంభం కానుంది. తొలిదశ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కానుంది. ౩ రోజుల పాటు జరిగే నామినేషన్ల దాఖలుకు అన్నిచోట్లా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ప్రక్రియను స్వయంగా సమీక్షించేందుకు రెండు రోజుల పాటు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ 3 జిల్లాల్లో పర్యటించనున్నారు.

రాష్ట్రంలో అన్ని పంచాయితీలలో ఎన్నికల నగారా మోగింది. ఎలక్షన్ల నిర్వహణలో ఉన్న ఇబ్బందులు.. పోలీసులను ఏర్పాటు చేయడంలో ఉన్న అడ్డంకులు.. కోవిడ్ వ్యాక్సినేషన్ దృష్ట్యా మార్పులు చేయాలని ఎలక్షన్ కమీషన్‌ను కోరారు కలెక్టర్లు... కలెక్టర్ల సూచనతో మార్పులు చేయడంతో మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 168 మండలాలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. ప్రకాశం జిల్లాలో ఒంగోలు డివిజన్లో మొత్తం 20 మండలాలకు గాను 15 మండలాలకు మాత్రమే ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమయ్యారు అధికారులు.

రాష్ట్రంలో మరికొన్ని గంటల్లో తొలిదశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ పత్రాల దాఖలు ప్రారంభం కానుంది. గ్రామ పంచాయతీల్లో సర్పంచి, వార్డు మెంబర్ల ఎన్నికకు నామినేషన్ల దాఖలు చేయనున్నారు. దీనికోసం ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. విజయనగరం మినహా 12 జిల్లాల్లో తొలిదఫాలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 12 జిల్లాల్లో 18 రెవెన్యూ డివిజన్లలో 168 మండలాల్లోని పంచాయతీల్లో తొలిదశలో ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

శుక్రవారం ఉదయం 10.30 గంటలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కానుంది. నిర్దేశిత ప్రాంతాల్లో ఎంపీడీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈనెల 31 సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగనుంది. తొలిదశ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో రేపట్నుంచి ౩ రోజుల పాటు నామినేషన్ల దాఖలు చేయనున్నారు. ఎన్నికలు జరిగే అన్ని పంచాయతీల్లో రేపు ఒటర్ల జాబితా ప్రదర్శించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది ఫిబ్రవరి 4 సాయంత్రం ౩ గంటల వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 9 న తొలి విడత పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 4 గంటలకు పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఫలితాల వెల్లడి అనంతరం అన్నిచోట్ల ఉప సర్పంచి ఎన్నికలు జరగనున్నాయి.

తొలిదశలో విజయనగరం మినహా మిగిలిన 12జిల్లాల్లో 18రెవెన్యూ డివిజన్లలో 168 మండలాల్లో గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ రెవెన్యూ డివిజన్లలో తొలి విడతలో ఎన్నికలు జరుగుతాయి. విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి రెవెన్యూ డివిజన్.. తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ గోదావరిలో నర్సాపురం.

కృష్ణా జిల్లాలో విజయవాడ గుంటూరు జిల్లాలో తెనాలి ప్రకాశం జిల్లా ఒంగోలులో తొలిదశ ఎన్నికలు జరుగుతాయి. నెల్లూరు జిల్లా కావలి, కర్నూలు జిల్లాలో నంద్యాల, కర్నూలులో తొలిదశలో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. అనంతపురం జిల్లా కదిరి, కడప జిల్లాలో జమ్మలమడుగు, కడప,రాజంపేట లో ఎన్నికలు నిర్వహిస్తారు. చిత్తూరు జిల్లాలో చిత్తూరు రెవెన్యూ డివిజన్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.

తొలిదశ ఎన్నికల ప్రక్రియ ను SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. రెండు రోజుల పాటు రాష్ట్రంలో ౩ జిల్లాల్లో SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ పర్యటించనున్నారు. అనంతపురం, కర్నూలు , కడప, జిల్లాల్లో పర్యటించి అధికారులతో సమీక్షించి తగు ఆదేశాలు జారీ చేయనున్నారు.

Tags:    

Similar News