వైసీపీపై ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. స్వయంగా రంగంలోకి జగన్..!
YSR Congress Party: అధికార పార్టీ వైసీపీలో పరిణామాలు మారుతున్నాయి.
YSR Congress Party: అధికార పార్టీ వైసీపీలో పరిణామాలు మారుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల షాక్‌తో అధినేత జగన్ అలర్ట్ అయ్యారు. పార్టీ బలోపేతంపై ఇన్నాళ్లూ మంత్రులు, జిల్లాల నేతలకు బాధ్యతలిచ్చిన జగన్ ఇప్పుడు తన రూట్ మార్చారు. తానే స్వయంగా ప్రజల్లో, కేడర్‌లో మమేకం అవ్వాలని డిసైడ్ అయ్యారు జగన్. త్వరలోనే నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల ఏడాది కావడంతో పనిచేయాల్సిన తీరుపై కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. స్వయంగా పార్టీ పరిస్థితులపై సమీక్ష చేయనున్న జగన్.. సమీక్షల తర్వాత లేదా సమీక్షల మధ్యలో జిల్లాల్లో పర్యటనలు చేయనున్నట్లు సమాచారం.