ED Raids: విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు
MVV Satyanarayana: వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆయన స్నేహితుడు, ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావుల ఇళ్లు, ఆఫీసులపై ఈడీ అధికారుల సోదాలు ముగిశాయి.
MVV Satyanarayana: వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆయన స్నేహితుడు, ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావుల ఇళ్లు, ఆఫీసులపై ఈడీ అధికారుల సోదాలు ముగిశాయి. ఏకకాలంలో ఐదు బృందాలుగా ఆకస్మిక దాడులు నిర్వహించారు. రుషికొండలోని ఎంవీవీ నివాసం, లాసన్స్‌బే కాలనీలోని పార్టీ కార్యాలయం, ఇల్లు, జీవీ స్క్వేర్‌లోని జీవీ కార్యాలయం, ఆయన ఇంట్లో సోదాలు జరిగాయి. ఫోర్జరీ సంతకాలతో హయగ్రీవ ప్రాజెక్టును లాక్కొన్నారంటూ చిలుకూరి జగదీశ్వరుడు, ఆయన భార్య రాధారాణి ఈ ఏడాది జూన్ 22న విశాఖలోని ఆరిలోవ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అక్కడ నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరా తీసింది. ఎంవీవీ, జీవీ నుంచి జగదీశ్వరుడికి సుమారు 9 నుంచి 12 కోట్లు లావాదేవీలు జరిగినట్లు సమాచారం ఉన్న నేపథ్యంలోనే ఈడీ దాడులు చేసినట్లు తెలుస్తోంది. నిన్న ఉదయం ప్రారంభమైన సోదాలు ఇవాళ తెల్లవారుజాము వరకు కొనసాగాయి. తనిఖీల సమయంలో మాజీ ఎంపీ ఎంవీవీ, జీవీలువారి నివాసాల్లోనే ఉన్నారు. తనిఖీల అనంతరం వారి నుంచి ఈడీ అధికారులు స్టేట్‌మెంట్లు రికార్డు చేసుకున్నారు. పలు కీలక పత్రాలు ఈడీ బృందాలు తీసుకెళ్లినట్టు సమాచారం.