Pulichintala: పులిచింతల సమీపంలో భూ ప్రకంపనలు
Pulichintala: గంట వ్యవధిలో రెండుసార్లు కంపించిన భూమి * రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 1.7గా నమోదు
Pulichintala: గుంటూరు జిల్లా పులిచింతల సమీపంలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఉదయం 7 గంటల 15 నిమిషాల నుంచి 8 గంటల 20 నిమిషాల్లోపు రెండు సార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 1.7గా నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. పులిచింతల ప్రాజెక్ట్ 16వ గేట్ రిపేర్ కారణంగా నీటిమట్టం తగ్గించడంతో భూమి పొరలలో ఏర్పడిన సర్దుబాట్ల కారణంగా భూమి కంపించి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఇది సర్వసాధారణమని అంటున్నారు పులిచింతల ప్రాజెక్ట్ జేఈ రాజశేఖర్.