Waltair Division DRM Chetan Kumar: సరుకు రవాణాలో ఆరోస్థానం

Waltair Division DRM Chetan Kumar: లాక్ డౌన్ లో అన్ని వ్యవస్థలు కుదేలుకాగా రైల్వే మాత్రం సుభిక్షంగా లాభాల బాటలో పయనిస్తోంది.

Update: 2020-07-08 04:00 GMT
Waltair division Goods Transport

Waltair Division DRM Chetan Kumar: లాక్ డౌన్ లో అన్ని వ్యవస్థలు కుదేలుకాగా రైల్వే మాత్రం సుభిక్షంగా లాభాల బాటలో పయనిస్తోంది. అయితే దీనికి ప్రధాన కారణం ఎటువంటి ఆటంకం లేకుండా సమయానుకూలంగా సరుకు రవాణా చేయడమే.. ఇంతవరకు సరుకు రావాణా చేయాలంటే ప్రయాణికుల రైళ్లకు ముందుకు పోనిచ్చి, తరువాత ఎప్పుడో తాపీగా గూడ్స్ రైళ్లను వదిలేవారు. దీంతో కొన్ని సమయాల్లో సరుకు చేరడం ఆలస్యమయ్యేది. అయితే లాక్ డౌన్ లో అన్ని రైళ్లను రద్దు చేయడం, కేవలం గూడ్స్ రైళ్లకు మాత్రమే అనుమతి ఇవ్వడం వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి వచ్చింది. దీనివల్ల దేశంలోని అన్ని డివిజన్లతో పోలిస్తే వాల్తేరు డివిజన్ అధిక సరుకు రవాణా చేసి ఆరో స్థానంలో నిలిచినట్టు అధికారులు ప్రకటించారు.

లాక్‌డౌన్‌ సమయంలో రికార్డు స్థాయిలో సరకు రవాణా చేసి వాల్తేరు రైల్వే డివిజన్‌ జాతీయ స్థాయిలో ఆరో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ నెలాఖరు వరకు 110.81 లక్షల టన్నుల సరకులను రవాణా చేసింది. బొగ్గు, ముడిఇనుము, ఇతర ఆహార పదార్థాలను విశాఖపట్నం పోర్టు, గంగవరం పోర్టు, బైలదిల్లా గనుల నుంచి తరలించినట్టు డీఆర్‌ఎం చేతన్‌కుమార్‌ శ్రీవాస్తవ తెలిపారు.

 

Tags:    

Similar News