Tirumala: శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది.
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో బంగారువాకిలి చెంత వేడుకను ఆగమోక్తంగా నిర్వహించారు. అర్చకులు ప్రత్యేక పూజా నివేదనలు, హరతులు, అరగింపులు సమర్పించడంతో దీపావళి ఆస్థానం ముగిసింది. ఆస్థానం సందర్భంగా ఉత్సవమూర్తులకు జరగాల్సిన అన్ని అర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. రాష్ట్రం సుభిక్షంగా..ఉండాలని దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.