ఆంధ్రప్రదేశ్ లో 32 జిల్లాల ఏర్పాటు దిశగా కసరత్తులు?

ఏపీలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం ఒక కొలిక్కి వచ్చిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా 32 జిల్లాల పేర్లతో లిస్టులు వైరల్ అవుతున్నాయి.

Update: 2020-11-09 03:31 GMT

ఎప్పటినుంచో ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు పై ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా ఒక కమిటీ దానికి అనుబంధంగా పలు కమిటీలు కూడా ఏర్పాటు చేసింది. లీగల్ వ్యవహారాల అధ్యయనం.. నిర్మాణాత్మక, సిబ్బంది పునర్విభజన అధ్యయనం, ఆస్తులు, మౌలిక సదుపాయాల అధ్యయనం, ఐటీ సంబంధిత పనుల అధ్యయనం ఇలా నాలుగు సబ్ కమేటీలు ఏపీ లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ పై కసరత్తులు చేస్తున్నాయి.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలు ఉన్నాయి. అయితే, పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న జిల్లాల ఏర్పాటు దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. దానికోసం వేసిన కమిటీలు తమ పని తాము చేస్తుండగా.. ఏపీలో ఎన్ని జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి అన్న అంశంపై సోషల్ మీడియాలో తరచు విస్తృతంగా ప్రచారం సాగుతోంది. గతంలో 25 జిల్లాలు అని ఒకసారి..27 జిల్లాలు అని మరోసారి సోషల్ మీడియా హోరేక్కిపోయింది. ఇప్పుడు కూడా మళ్ళీ కొత్తగా ఏపీలో జిల్లాలు ఎన్ని అనే అంశం పై సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం ప్రారంభం అయింది. నేదో, రేపో ఈ అంశంపై తేలిపోతుంది అన్నంతగా హడావుడి జరుగుతోంది.

తాజాగా సాగుతున్న ప్రచారం ప్రకారం ఏపీలో 32 జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయని చెబుతున్నారు. అంటే ప్రస్తుతం ఉన్న జిల్లాలకు దాదాపు రెండున్నర రెట్లు పెరగబోతున్నాయట. అంతేకాదు.. జిల్లాల లిస్టు.. జిల్లలలో ఉండే నియోజకవర్గాల లిస్టు కూడా విపరీతంగా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆ లిస్టు ప్రకారం ఏపీలో ఏర్పడబోయే కొత్త జిల్లాల లిస్టు ఈ విధంగా ఉంది..

1. పలాస, 2. శ్రీకాకుళం, 3. పార్వతీపురం, 4. విజయనగరం, 5. విశాఖపట్నం, 6. అరకు, 7. అనకాపల్లి, 8. కాకినాడ, 9. రాజమండ్రి, 10. అమలాపురం, 11. నర్సాపురం, 12. ఏలూరు, 13. మచిలీపట్నం, 14. విజయవాడ, 15. అమరావతి, 16. గుంటూరు, 17. బాపట్ల, 18. నర్సరావుపేట, 19. మార్కాపురం, 20. , గోలు, 21. నెల్లూరు, 22. గూడూరు, 23. తిరుపతి, 24. చిత్తూరు, 25. మదనపల్లె, 26. హిందూపురం, 27. అనంతపురం, 28. ఆదోని, 29. కర్నూలు, 30. నంద్యాల, 31. కడప, 32. రాజంపేట.

ఇక ప్రచారంలో ఉన్న జిల్లాల వారీగా నియోజకవర్గాలు ఇలా ఉన్నాయి..

1. పలాస - ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, 2. శ్రీకాకుళం - శ్రీకాకుళం, ఆముదాలవలస, నరసన్నపేట, ఎచ్చెర్ల, రాజాం, 3. పార్వతీపురం - పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ, 4. విజయనగరం - విజయనగరం, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోట, బొబ్బిలి, 5. విశాఖపట్నం -

భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, గాజువాక, పెందుర్తి, 6. అరకు - అరకు, పాడేరు, జి.మాడుగుల, 7. అనకాపల్లి - అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట, తుని, 8. కాకినాడ - ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ రామ చంద్రపురం 9. రాజమండ్రి - అనపర్తి, రాజానగరం, రంపచోడవరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, 10. అమలాపురం: - రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, గన్నవరం, మండపేట, కొత్తపేట, 11. నరసాపురం - తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం, 12. ఏలూరు - గొపాలపురం, పోలవరం, చింతలపూడి, దెందులూరు, ఉంగుటూరు, ఏలూరు, 13. మచిలీపట్నం - కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, 14. విజయవాడ - తిరువూరు, నూజివీడు, గన్నవరం, పెనమలూరు, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, మైలవరం, 15. అమరావతి - పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ, 16. గుంటూరు - తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, పొన్నూరు, 17. బాపట్ల - రేపల్లె, వేమూరు, బాపట్ల, చీరాల, పర్చూరు, 18. నరసరావుపేట - చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ,

19. మార్కాపురం - ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, 20. ఒంగోలు -,అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, కందుకూరు, 21. నెల్లూరు - కావలి, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, ఉదయగిరి, 22. గూడూరు - సర్వేపల్లి, వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట, 23. తిరుపతి - శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, తిరుపతి, చంద్రగిరి, 24. చిత్తూరు - పూతలపట్టు, చిత్తూరు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం, 25. మదనపల్లి - పీలేరు, పుంగనూరు, మదనపల్లి, తంబళ్లపల్లి, 26. హిందూపురం - కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుగొండ, మడకశిర, హిందూపురం, 27. అనంతపురం

రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, అనంతపురం, రాప్తాడు, శింగనమల, తాడిపత్రి, 28. ఆదోని - పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, 29. కర్నూలు - నందికొట్కూరు, కర్నూలు, డోన్, కోడుమూరు, 30. నంద్యాల - శ్రీశైలం, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం, 31. కడప - జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల, కడప, 32. రాజంపేట - బద్వేలు, రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి

ఇలా ప్రచారంలో ఉన్న లిస్టు ఎంతవరకూ నిజమో తెలియాలంటే మాత్రం కొంత వేచి చూడాల్సిందే. ఎందుకంటే, ఇందుకోసం ఏర్పాటయిన కమిటీలు తమ నివేదికలు ప్రభుత్వానికి అందించాలి. ప్రభుత్వం ఈ దిశలో మిగిలిన ఏర్పాట్లు పూర్తి చేయాలి. తరువాత అధికారికంగా ప్రకటించాలి. 

Tags:    

Similar News