District Committee Ready to Report on Swarna Palace: జిల్లా కమిటీ నివేదికలు సిద్ధం

District Committee Reports ready on Swarna Palace: స్వర్ణా ప్యాలెస్ ప్రమాదంపై జిల్లా కమిటీ నివేదికలు సిద్ధమయ్యాయి. ఫైర్, విద్యుత్, వైద్య మరియు భద్రతా కమిటీలు నివేదికలను సిద్ధం చేశాయి. ఈ రోజు సాయంత్రం కలెక్టర్ ఇంతియాజ్‌కు కమిటీలు నివేదిక ఇవ్వనున్నాయి.

Update: 2020-08-11 09:27 GMT
vijayawada

District Committee Ready to Report on Swarna Palace: విజ‌య‌వాడ‌లోని స్వర్ణా ప్యాలెస్ ప్రమాదంపై జిల్లా కమిటీ నివేదికలు సిద్ధమయ్యాయి. ఫైర్, విద్యుత్, వైద్య మరియు భద్రతా కమిటీలు నివేదికలను సిద్ధం చేశాయి. ఈ రోజు సాయంత్రం కలెక్టర్ ఇంతియాజ్‌కు కమిటీలు నివేదిక ఇవ్వనున్నాయి.

నివేదికలో కీలకాంశాలు:-

* స్వర్ణా ప్యాలెస్‌ లో అగ్ని ‌ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం ఇవ్వలేదని కమిటీ తేల్చి చెప్పింది.

* మంటలను చెలారేగిన వెంట‌నే ఫైర్ స్టేష‌న్ కు సమాచారమివ్వ కుండా, ఆల‌స్యంగా స‌మాచార‌మివ్వ‌డంతోనే భారీ ప్ర‌మాదం జ‌రిగింది.

* అగ్ని ప్రమాదం గుర్తించే కనీస పరికరాలు, స్మోక్ డిటెక్టర్, పని చేయని అలారం వల్లే అత్యధిక మంది మృతి.

* రమేష్ ఆసుపత్రి, స్వర్ణా ప్యాలెస్ యజమాన్యాల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం. ప్రభుత్వ నిబంధనలు పాటించ లేదని నిర్దారణ

* కోవిడ్ పేషేంట్స్ నుంచి డబ్బులు భారీగా వసూలు చేసినట్టు విచారణలో వెల్లడి

* అనుమతికి మించి పేషేంట్స్‌ను చేర్చుకున్నట్టు గుర్తింపు

* భద్రతా ప్రమాణాలు లేకపోయినా స్వర్ణా ప్యాలెస్‌లో కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటుకు అనుమతి.

* షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశాలు చాలా తక్కువని, కలప, ఫైబర్‌తో చేసిన ఇంటీరియర్ డెకరేషన్‌కు సానిటైజేషన్ వాడకం ఎక్కువగా ఉండటం వల్ల మంటలు త్వరగా వ్యాపించాయని విద్యుత్ శాఖ కమిటీ నివేదిక. 

Tags:    

Similar News