Kadapa: కడప జిల్లాలో వినాయక నిమజ్జనంలో అపశృతి.. ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయాలు
Kadapa: నిప్పు అంటించండతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
Kadapa: కడప జిల్లాలో వినాయక నిమజ్జనం సందర్భంగా చేపట్టిన ఊరేగింపులో అపశృతి చోటు చేసుకుంది. ఎర్రగుంట్ల నగర పంచాయతీలో కొందరు యువకులు కాంతార మూవీలోని పాటకు డ్యాన్స్ చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఓ వలయం గీసి దాని చుట్టూ పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయాలైన వారిని హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు స్థానికులు. అయితే పోలీసుల భద్రతా వైఫల్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పెట్రోల్ క్యాన్ పట్టుకుని జనం మధ్యలో వినాయక కమిటీ సభ్యులు తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు.