TikTok Bhargav: టిక్‌టాక్ భార్గవ్ నిజరూపం బయటపెట్టిన పోలీసులు
TikTok Bhargav: విశాఖ బాలిక అత్యాచార ఘటన కేసులో పోలీసులు పురోగతి సాధించారు.
TikTok Bhargav: విశాఖ బాలిక అత్యాచార ఘటన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అత్యాచారానికి పాల్పడిన టిక్‌టాక్ స్టార్ భార్గవ్‌ను విశాఖ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. 14ఏళ్ల మైనర్ బాలికను లైంగికంగా వాడుకుని బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డాడు టిక్ టాక్ స్టార్ భార్గవ్. బాలికను గర్భవతిని చేసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడినట్టు దిశ ఏసీపీ ప్రేమ కాజల్ తెలిపారు. సినిమా ఛాన్స్ ఇప్పిస్తానని వేపగుంటకు చెందిన బాలికను నమ్మించి మోసం చేసినట్టు వెల్లడించారు. మైనర్ బాలికను ప్రేమిస్తున్నట్టు వెంటపడ్డానని స్పష్టం చేశారు సోషల్ మీడియాలో పాపులర్ చేస్తామంటే నమ్మోద్దని దిశ ఏసీపీ ప్రేమకాజల్ సూచించారు.