Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లా చెట్లతాండ్ర గ్రామంలో వింత ఆచారం
Andhra Pradesh: ప్రతీ ఏడాది భీష్మ ఏకాదశి రోజున ప్రత్యేక పండుగ * శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలోని
Andhra Pradesh: మీకు కష్టాల్లో కొట్టు మిట్టాడుతున్నారా అయితే ఒక అరిపండ్ల గెలను తీసుకొని భీష్మ ఏకాదశి రోజున ఆ గ్రామానికి వెళ్లండి. మరుసటి రోజు ద్వాదశి నాడు మీ గెలను తిరిగి తీసుకెళ్లి ప్రసాదంగా తీసుకొండి. అంతే మీ కష్టాలు తొలగిపోతాయి. ఏమిటి ఏదో కథ చెబుతున్నారనుకుంటున్నారా..? అయితే ఈ కథనం మీరూ చూడండి.
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్ర గ్రామానికి ఓ విశేషం ఉంది. ఇక్కడి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రతి ఏడాది భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పండుగ జరుగుతుంది. ఇక్కడ స్వామిని దర్శించుకుని ఆలయం ఎదురుగా ఉన్న రావిచెట్టు ప్రక్కన వేసిన పందిళ్లకు అరటి గెలలు నైవేధ్యంగా పెట్టి కొరికలు కొరుకుంటే అవి నెరవేరుతాయన్నది భక్తుల నమ్మకం. ఆ కట్టిన గెల కూడా మరుసటి రోజు ద్వాదశి నాడే ప్రసాదంగా తీసుకోవాలి. ఇది ఇక్కడ నియమం.
వింతైన ఈ ఆచారం వెనుక ఓ కథ ఉంది. రెండు వందల ఏళ్ల క్రితం ఈ గ్రామంలో ఓ స్వామీజీ గ్రామస్థులకు వైద్యం చేసేవాడు. తర్వాత స్వామీజీ మృతి చెందాక గ్రామంలో రావి చెట్టు వెలిసింది. ఆ చెట్టును స్వామీజీ స్వరూపంగా భావించిన గ్రామస్తులు పూజించడం ప్రారంభించారు. స్వామీజీ బ్రతికున్నన్నాళ్లు అరటి పళ్లను మాత్రమే తినేవాడు కాబట్టి ఆ చెట్టుకు అరటి గెలలను కడుతు పూజిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. సనాతన సంప్రదాయాలకు పుట్టినిల్లైన శ్రీకాకుళం జిల్లాలో పూర్వీకుల ఆచారాల్ని పాటిస్తూ ప్రతీ ఏటలా ఈ ఏడు కూడా భీష్మ ఏకాదశి రోజున భక్తులు అరటి గెలలతో వచ్చి మొక్కులు తీర్చుకున్నారు.