తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ.. స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం
Tirumala: వేసవి సెలవుల దృష్ట్యా కొండపై పెరిగిన భక్తులు
Tirumala: కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి సన్నిధానంలో భక్తుల తాకిడి పెరిగింది. ఏపీలో ఎన్నికల హడావుడి ముగియడంతో పాటు వేసవి సెలవుల కారణంగా భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలివెళ్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు రెండు నడక మార్గాలు మొదలుకొని శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు మాడ వీధులు, లడ్డూ ప్రసాద కేంద్రం, అన్న ప్రసాద భవనం, బస్టాండ్, సీఆర్వో ప్రాంతాల్లో భక్తుల రద్దీ అధికంగా కనిపిస్తోంది.
ఎక్కడ చూసినా శ్రీవారి భారీగా క్యూలైన్లలో వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. అయితే సామాన్యులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎన్నికల్లో కోడ్ అమల్లో ఉండడంతో ప్రోటోకాల్ పరిధి కలిగిన వ్యక్తులకు పరిమితం చేస్తూ.. సిఫార్సు లేఖలపై మాత్రం బ్రేక్ దర్శనాన్ని రద్దు చేసింది టీటీడీ.