Srisailam: శ్రీశైలం ముక్కంటి ఆలయానికి పోటెత్తిన భక్తులు
Srisailam: శ్రావణమాసం మొదటిరోజునే పెరిగిన భక్తుల రద్దీ
Srisailam: శ్రావణమాసం మొదటిరోజున శ్రీశైలం ముక్కంటి ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రావణమాసం ప్రారంభం కావడం.. పైగా సోమవారం కావడంతో క్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్ల దర్శనార్థమై భక్తులు క్యూలైన్స్ లో బారులు తీరారు.
రద్దీతో స్వామి దర్శనానికి సుమారు 5 గంటలకు పైగా పట్టింది. భక్తుల సౌకర్యార్థం ఆలయ ఈవో పెద్దిరాజు అన్ని ఏర్పాట్లు చేయించారు. దర్శనార్థమై క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, బిస్కెట్స్, మంచినీరు అందించే ఏర్పాట్లు చేశారు.