Tirumala: తిరుమల లడ్డూ నాణ్యతపై భక్తుల హర్షం

Tirumala: లడ్డూ రుచి,నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆలయ ఈవో

Update: 2024-08-11 08:04 GMT

Tirumala: తిరుమల లడ్డూ నాణ్యతపై భక్తుల హర్షం 

Tirumala: ప్రపంచస్థాయి గుర్తింపు అనేది ప్రాంతాన్నికో, ఓ కట్టడానికి, చిత్రానికో ఉంటుంది‌. కానీ తిరుమల క్షేత్రంలో ప్రసాదానికి ప్రపంచస్థాయి గుర్తింపు ఉంది. వెంకన్నను దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు కొండకు చేరుకుంటారు. దివ్యమంగళుడి రూపం శ్రీవారిని దర్శించుకుని జన్మ ధన్యమైనట్లు భావిస్తారు. అయితే తిరుమల ఎంత ఫేమస్సో.. తిరుపతి లడ్డులు కూడా అంతే ఫేమస్. తిరుమలకు వెళ్లే భక్తులకే కాదు.. భక్తులు తీసుకొచ్చే లడ్డుల కోసం ఎంతో ఇష్టంగా అందరూ ఎదురుచూస్తూ ఉంటారు.

గడచిన కొన్ని కొంతకాలంగా లడ్డు నాణ్యత తగ్గిందనే అసంతృప్తి సర్వత్రా వినిపించాయి. అయితే ప్రస్తుతం టీటీడీ ఈవోగా శ్యామలరావు, అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రసాదం నాణ్యత పెంచడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నాణ్యమైన నెయ్యితో పాటు దినుసులు కూడా సక్రమంగా వినియోగించడానికి సూచనలు చేశారు. అయితే శ్రీవారి దర్శనం తర్వాత లడ్డులు పొందిన భక్తులు లడ్డు నాణ్యత పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తిరుమలలో నిత్యం లక్షలాది మంది భక్తులు వెంకన్నదర్శనానికి వచ్చిన సమయంలో.. లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించి ఆధ్యాత్మిక తన్మయత్వం పొందుతుంటారు. కొలమానాల ప్రకారం 5,100 లడ్డూలు తయారు చేస్తారు. కాలానుగుణంగా పెరుగుతున్న భక్తుల రద్దీ నేపధ్యంలో.. రోజు దాదాపు మూడు లక్షల ఇరవై వేల లడ్డూలను టీటీడీ తయారు చేస్తోంది.

Tags:    

Similar News