Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వం ముంపు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చింది

Pawan Kalyan: కాకినాడ జిల్లా గొల్లప్రోలు ముంపు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు.

Update: 2024-09-09 12:46 GMT

Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వం ముంపు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చింది

Pawan Kalyan: కాకినాడ జిల్లా గొల్లప్రోలు ముంపు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. ఏలేరు వరద ముంపు కారణంగా గొల్లప్రోలులోని నీట మునిగిన జగనన్న కాలనీ, పంట పొలాలను పరిశీలించారు. పడవలో వెళ్లి ముంపు ప్రాంతాల ప్రజలతో మాట్లాడారు పవన్ కల్యాణ్. గత ప్రభుత్వం ఐదేళ్లలో కాలువలలో పూడికలు తీయలేదన్న పవన్ కల్యాణ్, గత ప్రభుత్వం ముంపు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చిందని తెలిపారు. ఎవరు చేశారు, ఏం చేశారు అనేది మాట్లాడితే పొలిటికల్‌గా ఉంటుందని.. ఏపీలో గత 50 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా వర్షాలు కురుస్తున్నాయని పవన్‌ తెలిపారు. 20 ఏళ్లలో ఎప్పుడూ లేనివిధంగా రిజర్వాయర్లు అన్ని నిండాయని వెల్లడించారు.

గత ప్రభుత్వం ముంపు ప్రాంతాలలో ఇళ్ల స్థలాలు ఇచ్చిందన్నారు. బ్రిడ్జ్ ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. వరదపోయిన తర్వాత అన్ని విషయాలపై చర్చిస్తామని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు. వరద ప్రవాహం తగ్గే వరకు తాను జిల్లాలోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తానని, వరద బాధితులకు అవసరమయిన సహాయాన్ని అందిస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. జిల్లా అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి, బాధితులకు తక్షణ సహాయం అందించాలని ఆయన సూచించారు.

Tags:    

Similar News