Pawan Kalyan: సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ లేఖ

Pawan Kalyan: మంగళగిరిలోని తన నివాసానికి మార్చుకోవాలని పవన్ నిర్ణయం

Update: 2024-09-12 13:22 GMT

Pawan kalyan: సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ లేఖ

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.. సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. క్యాంప్ కార్యాలయాన్ని విజయవాడ నుంచి మంగళగిరిలోని తన నివాసానికి మార్చుకోవాలని పవన్ నిర్ణయించుకున్నారు. దీంతో ఆ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. క్యాంప్ కార్యాలయం మార్పునకు ఆమోదం తెలపాలని లేఖలో కోరారు పవన్.

ప్రస్తుతం విజయవాడలోని ఇరిగేషన్ భవనాన్ని...పవన్ క్యాంప్‌ కార్యాలయంగా వినియోగించుకుంటున్నారు. తనకు ఆ భవనాన్ని కేటాయించినందుకు సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు పవన్. ఇప్పుడు ఇంటినే క్యాంప్ కార్యాలయంగా వాడుకోవాలని నిర్ణయించుకోవడంతో.. విజయవాడలో తనకు కేటాయించిన భవనాన్ని, ఫర్నిచర్స్‌ను వెనక్కి తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News