Farmers: రైతులకు తీపికబురు..అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయో లేదో చెక్ చేసుకోండి.

Amaravati: అమరావతి రైతులకు గుడ్ న్యూస్. బ్యాంకు అకౌంట్లోకి డబ్బు జమ అయ్యాయి. మీకు కూడా జమ అయ్యాయో లేదో చెక్ చేసుకోండి.

Update: 2024-09-17 05:09 GMT

 Farmers: రైతులకు తీపికబురు..అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయో లేదో చెక్ చేసుకోండి

Farmers: ఏపీ రైతులకు సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులను జమ చేసింది. దీంతో చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఎవరెవరికి డబ్బులు వచ్చాయి..బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయా అనే విషయాలు తెలుసుకుందాం. ఏపీ సర్కార్ కొంతమంది రైతుల అకౌంట్లో మాత్రమే డబ్బులు జమ చేసింది. అమరావతి రైతులు మాత్రమే ఈ ప్రయోజనం పొందారు. వారికి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. అశ్చర్యంగా ఉందా..అయితే పూర్తి వివరాలు తెలుసుకుందాం.

అమరావతి రైతులకు కౌలు డబ్బులను తమ ఖాతాల్లోకి జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి సీఆర్డీఏ కౌలు డబ్బులు జమ చేసినట్లు వెల్లడించింది. అందుకే వీరికి మాత్రమే ప్రయోజనం కలుగుతుందని చెప్పవచ్చు. అమరావతి నిర్మాణం కోసం 28వేల మందికిపైగా రైతులు దాదాపు 34 వేల ఎకరాలు భూములు ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరికి ప్రభుత్వం 2014 నుంచి కౌలు డబ్బులు చెల్లిస్తోంది. ఇలా పదేండ్ల వరకు వీళ్లకు డబ్బులు అందాయి.

అయితే మధ్యే వచ్చిన కొత్త ప్రభుత్వం ఈ పదేళ్ల కాల పరిమితిని మరో పదేండ్లు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంటే ఇంకో ఐదేండ్ల పాటు వీరికి డబ్బులు జమ అవుతుంటాయి. దీని భాగంగా ఇప్పుడు ప్రభుత్వం కౌలు డబ్బులు చెల్లించింది. గతంలో ఎంత చెల్లించారో ఇకపై కూడా అంతే మొత్తంలో డబ్బులు చెల్లించనున్నారు. అందువల్ల అన్నదాతలకు వచ్చే ఏమీలేదు. మరో ఐదేండ్ల పాటు కౌలు డబ్బులు వస్తూనే ఉంటాయి.

Tags:    

Similar News