మహిళా కమిషన్ నోటీసులపై టీడీపీలో తర్జన భర్జన
Andhra Pradesh: హాజరు కావాలా వద్దా అన్నదానిపై చంద్రబాబు, బోండా ఉమ కన్ఫ్యూజన్.
Andhra Pradesh: ఏపీ మహిళా కమిషన్ నోటీసులపై ఎలా స్పందించాలన్నదానిపై టీడీపీ తర్జనభర్జనపడుతోంది. విజయవాడ ఆస్పత్రిలో గ్యాంగ్ రేప్ బాధితురాలి పరామర్శ సమయంలో జరిగిన గొడవ టీడీపీ, వైసీపీ మధ్య అగ్గిరాజేసింది. టీడీపీ నేతల తీరుపై మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమకు నోటీసులు జారీ చేసింది.
స్వతంత్ర ప్రతిపత్తిగల మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడంతో ఎలా రియాక్ట్ కావాలన్నదానిపై టీడీపీ నేతలు మల్లగుల్లాపడుతోంది. హాజరైతే ఏంటి? హాజరు కాకుంటే ఏమవుతుందన్న ఆందోళన పార్టీలో కన్పిస్తోంది. మొత్తం వ్యవహారంపై టీడీపీ న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటోంది. ఏపీ మహిళా కమిషన్ నోటీసులపై కోర్టులు, నేషనల్ ఉమెన్ కమిషన్‌ను ఆశ్రయించే యోచనలో టీడీపీ ఉంది.