Day Curfew in AP: ఏపీలో 5 నుంచి డే కర్ఫ్యూ

Day Curfew in AP: విపరీతంగా పెరిగిన కరోనా కేసులు దృష్ట్యా ఏపీలో 5 నుంచి డే కర్యూ విధించనున్నట్లు మంత్రి ఆళ్ల నాని తెలిపారు.

Update: 2021-05-03 08:47 GMT
ఆంధ్రప్రదేశ్ లో డే కర్ఫ్యూ (ఫైల్ ఇమేజ్)

Day Curfew in AP: కరోనా సెగ ఏపీ ప్రభుత్వాన్ని గట్టిగానే తాకింది. ఒకే రోజులో 24 వేలు కేసులు నమోదవ్వడంతో పరిస్ధితి తీవ్రత అర్ధమైంది. అందుకే ఇప్పటివరకు నైట్ కర్ఫ్యూ విధించిన ఏపీ సర్కార్.. పగలు కూడా కొన్ని గంటలు కర్ఫ్యూ విధించాలని ఆలోచిస్తోంది. ఈ ఆలోచనను స్వయంగా మంత్రి ఆళ్ల నాని మీడియాకు చెప్పారు. రేపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా పరిస్ధితులపై మంత్రులతో చర్చించనున్నారు. అప్పుడే ఈ పగలు కర్ఫ్యూ నిర్ణయాన్ని తీసుకుని, విధి విధానాలను ఫైనల్ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

మే 5 నుంచే అమలు చేస్తారని మంత్రి ఇప్పటికే చెప్పారు. ఈ కర్ఫ్యూ ఆంక్షలు రెండు వారాల పాటు విధించనున్నట్లు మంత్రి తెలియచేశారు. అయితే అత్యవసర సేవలకు మినహాయింపు ఇస్తామని స్పష్టం చేశారు. ఏపీలో కరోనా తీవ్రంగా వ్యాపిస్తూ.. మరణాల సంఖ్య కూడా పెరుగుతున్న సందర్భంలో డే కర్ఫ్యూ ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు సమాచారం. గత వారం సీఎం జగన్మోహన్ రెడ్డి లాక్ డౌన్ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించారు.. లాక్ డౌన్ వల్ల కోట్లలో నష్టపోవాల్సి వస్తుందని చెప్పారు. కాని పరిస్ధితులు అంతకంతకు చేజారిపోతుండటంతో.. క్రమక్రమంగా ఏపీ లాక్ డౌన్ వైపు పయనించక తప్పడం లేదు.

Tags:    

Similar News