రేపట్నుంచి దర్శనాలకు ఓకే : శ్రీకాళహస్తి అధికారుల గుడ్ న్యూస్

Update: 2020-06-14 01:28 GMT
srikalahasti temple opens for darshan (file image)

ఈ నెల 8 నుంచి దేవాలయాల్లో దర్శనాలకు అనుమతిచ్చిన ప్రభుత్వం శ్రీకాళహస్తిలో పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో వాయిదా వేశారు. అయితే పరిస్థితి అంతా సర్ధుకున్నాక సోమవారం ఉదయం నుంచి దర్శనాలు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ముందు రెండు రోజులు ఆలయ అధికారులు, సిబ్బందితో పాటు మీడియా ప్రతినిధులకు అవకాశం ఇవ్వగా, బుధవారం నుంచి సామన్య భక్తులు దర్శనం చేసుకునేందుకు వీలు కల్పించారు. అయితే దర్శనం చేసుకునే వారు తప్పనిసరిగా కొన్ని షరతులు పాటించాలంటూ నిబంధనలు విధించారు.

శ్రీకాళహస్తిలో దర్శనాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పారు ఆలయ అధికారులు. సోమవారం నుంచి శ్రీకాళహస్తి ముక్కంటి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అయితే ఎల్లుండి కేవలం ఆలయ సిబ్బంది, మీడియా ప్రతినిధులకు మాత్రమే దర్శనం ఉంటుందని, ఆ మరుసటి రోజు స్థానికులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు ఈవో తెలిపారు. ఇక బుధవారం నుంచి సాధారణ భక్తులకు స్వామి వారి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అలాగే శ్రీకాళహస్తిలో ప్రత్యేకంగా నిర్వహించే రాహుకేతువుల పూజలు యథాతథంగా జరుగుతాయన్నారు. కాగా ఇక ఆలయానికి వచ్చే భక్తులు ఎలా ఉండాలనేది పలు సూచనలు చేశారు.

సూచనలు:

- ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఆలయం తెరిచే ఉంటుంది

- లడ్డు, పులిహోర ప్రసాదాలను విక్రయం యథాతథం

- తలనీలాల సమర్పించే భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే క్షురకులకు పిఈపీ కిట్లను ఇచ్చాము

- ఏ రాష్ట్రం నుంచి అయినా భక్తులు దర్శనానికి రావచ్చు

- దర్శనానికి వచ్చే భక్తులు ఖచ్చితంగా ఆధార్ కార్డును తీసుకురావాలి

- గంటకు 300 మంది భక్తులకు దర్శనం

- అలాగే అభిషేకాలు, ఉచిత ప్రసాదాలు, శఠగోపాలు, హారతులు రద్దు

- వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లలకు ఆలయ ప్రవేశం లేదు

- దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరిస్తూ.. భౌతిక దూరం పాటించాలని పేర్కొన్నారు. 

Tags:    

Similar News