Purandeswari: రాజకీయమా..? రక్త సంబంధమా..?
Purandeswari: చంద్రబాబు అరెస్టుతో సందిగ్ధంలో పురంధేశ్వరి..?
Purandeswari: ఓ వైపు కుటుంబ వ్యక్తి.. మరోవైపు రాజకీయ ప్రత్యర్థి. ఈ పరిస్థితుల్లో రక్త సంబంధానికి మద్దతు ఇవ్వాలా..? లేక తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలా.. ? కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తే... పార్టీ లైన్ దాటినట్టు అవుతుంది. అదే రాజకీయ ప్రయోజనాలు చూస్తే.. బంధుత్వాన్ని విస్మరించినట్టు అవుతుంది. ఇది ప్రస్తుతం ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ‌్వరి ఎదుర్కొంటున్న పరిస్థితి. చంద్రబాబు అరెస్టు.. ఆమెను సందిగ్ధంలో పడేసినట్టైంది. పురందేశ్వరి, చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థులు అయినా.. ఇద్దరూ నందమూరి ఫ్యామిలీకి చెందిన వ్యక్తులే. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి,, పురందేశ్వరి సొంత అక్కాచెల్లెలు. రాజకీయాలను పక్కనపెడితే ఫ్యామిలీ పరంగా అంతా కలిసే ఉంటారు. ఇటీవల ఎన్టీఆర్ స్మరక నాణెం విడుదలలోనూ కలిసే పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టు విషయంలో ఎలా వ్యవహరించాని అమోమయంలో పడిపోయారు పురందేశ్వరి.
సీనియర్ ఎన్టీఆర్ మరణం అనంతరం పార్టీపై ఆధిపత్యం కోసం నందమూరి ఫ్యామిలీలో.. అలజడి చెలరేగిన విషయం అందరికీ తెలిసిందే. టీడీపీ పగ్గాలు చంద్రబాబు చేపట్టడంతో.. దగ్గుబాటి ఫ్యామిలీ పక్కకు తప్పుకుంది. మొన్నటి వరకు నారా, దగ్గుబాటి ఫ్యామిలీ మధ్య వైరం నడిచినా.. మళ్లీ కలిసిపోయారు. కుటుంబ పరంగా అంతా కలిసే ఉన్నారు. పురందేశ‌్వరి తొలుత కాంగ్రెస్, ఆ తర్వాత బీజేపీలో చేరారు. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ మధ్య దోస్తి చెడడంతో.. మళ్లీ కలిసే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. అటు బీజేపీ కూడా జగన్, చంద్రబాబుకు సమదూరం పాటిస్తున్నట్టు కనిపించినా.. పురందేశ్వరిని అధ్యక్షురాలిగా నియమించడంతో..టీడీపీకి దగ్గరయ్యే వ్యూహంలో భాగమనే అనే ప్రచారం జరిగింది. కానీ కట్ చేస్తే.. చంద్రబాబు అరెస్ట్ అందరినీ ఆశ్చర్యరానికి గురి చేసింది. కేంద్రం సపోర్ట్ లేకుండా.. మాజీ ముఖ్యమంత్రి హోదా వ్యక్తిని అరెస్ట్ చేయడం అసంభవమనే అనుకోవాలి. చంద్రబాబు అరెస్ట్ వెనకలా.. జగన్ కు కేంద్రం సపోర్ట్ ఉందనే ప్రచారం జరుగుతుంది. దీంతో చంద్రబాబు అరెస్టును పురందేశ్వరి ఖండించినా.. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. టీడీపీ చేపట్టిన బంద్ లో జనసేన పాల్గొన్నది కానీ.. బీజేపీ దూరంగానే ఉంది.
చంద్రబాబు అరెస్టు విషయంలో పురందేశ్వరి.. స్టాండ్ ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది. రాజకీయపరంగా చూస్తే.. టీడీపీ- బీజేపీ పొలిటికల్ ప్రత్యర్థులు. రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా చంద్రబాబు అరెస్టుపై బీజేపీ సైలెంట్ గా ఉంది. దీంతో బంధమా లేక బాధ్యతా అనే సంకెళ్లలో చిక్కుకున్నట్టు అయింది పురందేశ‌్వరి పరిస్థితి. ఈ టైంలో సోదరి భువనేశ్వరికి మద్దతుగా ఉండాలా లేక పార్టీ దృష్ట్యా దూరంగా ఉండాలా అనే సందిగ్గంలో పడింది. ఎంత పొలిటికల్ ప్రత్యర్థులు అయినా.. కష్టకాలంలో కుటుంబ సభ‌్యుల నుంచి మోరల్ సపోర్ట్ కోరుకుంటారు ఎవరైనా. ఈ టైంలో పురందేశ్వరి మౌనం వహించడం.. కుటుంబ బంధంపై ఎలాంటి ప్రభావం చూపనుంది.
రాజకీయాలను పక్కనపెట్టి.. వ్యక్తిగతంగా వెళ్లి చంద్రబాబును దగ్గుబాటి ఫ్యామిలీ పరామర్శిస్తారా లేక పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటారా అనేది చర్చనీయాంశమైంది. టీడీపీ, బీజేపీ మధ్య దోస్తీ కోసమే.. పురందేశ్వరిని చీఫ్‌గా నియమించారనే ప్రచారం జరిగింది. ఆమె కూడా జగన్ సర్కార్ పై విమర్శలు దాడి చేశారు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి చంద్రబాబు అరెస్ట్ తో తెరవెనక ఏం జరిగిందనే చర్చ నడుస్తోంది.