Daggubati Purandeswari: వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేసింది

Daggubati Purandeswari: నాణ్యతలేని మద్యం సరఫరాతో అందినకాడికి దోచుకుంటున్నారు

Update: 2023-09-24 10:15 GMT

Daggubati Purandeswari: వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేసింది

Daggubati Purandeswari: విశాఖలో బీజేపీ సోషల్‌మీడియా వాలంటీర్ల సమావేశం నిర్వహించారు. సాగరమాల ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, ఎంపీ జీవీఎల్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడారు. ఏపీలో కక్ష పూరిత రాజకీయాలు చూస్తున్నామన్నారు పురంధేశ్వరి. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేసిందని ఆరోపించారు. నాణ్యతలేని మద్యం సరఫరాతో అందినకాడికి దోచుకుంటున్నారన్నారు. భవిష్యత్‌పై భయంతో ఏపీ నుంచి యువత తరలిపోతున్నారని ఆరోపించారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదనే జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సోషల్‌మీడియా వాలంటీర్లకు సూచించారు.

Tags:    

Similar News