Rain Alert: ఏపీకి తుపాను ముప్పు.. మూడు రోజులపాటు అతి భారీ వర్షాలు

Rain Alert: ఏపీపై మరోసారి తుపాన్ ప్రభావం చూపనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తుపాన్ గా మారనుందని..దీంతో రానున్న మూడు రోజుల్లో ఏపీలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ తుపాన్ ప్రభావం ఏ జిల్లాలపై ఉంటుందో తెలుసుకుందాం.

Update: 2024-10-14 02:30 GMT

Rain Alert: ఏపీకి తుపాను ముప్పు.. మూడు రోజులపాటు అతి భారీ వర్షాలు

Rain Alert: ఏపీపై మరోసారి తుపాన్ ప్రభావం చూపనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలబడి తుపానుగా మారే ఛాన్స్ ఉందని దీని కారణంగా రానున్న మూడు రోజులు ఏపీలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ తుపాను ప్రభావం ఏఏ జిల్లాలపై ఉంటుందో చూద్దాం.

ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తనం క్రమంగా బలపడుతోంది. ఈ రోజు ఏదొక సమయానికి అల్పపీడనంగా మారే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం బంగాళాఖాతానికి అధిక ఉష్ణోగ్రతలు ఉన్నందున అల్పపీడనం మరింత తీవ్రమై తుపానుగా మారే ఛాన్స్ ఉందని ఐఎండీ అధికారులు అంటున్నారు.

మరోవైపు అరేబియా మహాసముద్రంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం సోమవారం నాటికి తీవ్ర వాయుగుండం మారుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ వాయుగుండం ప్రభావం తమిళనాడుతోపాటు ఏపీలోని రాయలసీమ ప్రాంతాలపై అధిక ప్రభావం చూపిస్తుంది. దీంతో వాతావరణ శాఖ తమిళనాడులోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. అటు రాయలసీమకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

అల్పపీడనం ప్రభావంతో మంగళవారం ఏపీలోని బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. బుధవారం రాష్ట్రంలోని బాపట్ల, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల కలెక్టర్లకు ముందస్తు సూచనలు చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదనిహెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..వారికి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


Tags:    

Similar News