Chittoor: తీవ్ర ప్రభావం చూపిన మిచౌంగ్ తుఫాన్.. వర్షాలకు కుప్పకూలిన భవనం.. రెండు కార్లు ధ్వంసం
Chittoor: ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు
Chittoor: మిచౌంగ్ తుఫాన్ ప్రభావం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తీవ్ర ప్రభావం చూపుతోంది. గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా తిరుపతి నగరంలోని చెన్నరెడ్డి కాలనీలో ఓ భవనం కుప్పకూలింది.. అయితే భవనం కూలే సమయంలో ఎవరూ లేక పోవడం కారణంగా ప్రాణహాని జరుగలేదు.
భవనం ముందు పార్క్ చేసి ఉన్న రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. వర్షాల కారణంగా ఉమ్మడి చిత్తూరు.వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. పెనుమూరు మండలం, కల్వకుంట్ల ఎన్టీఆర్ జలాశయం గేట్లను అధికారులు ఎత్తి వేశారు.అంతేకాకుండా నీవా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మల్లెమడుగులో నీటి ఉధృత అధికంగా ఉండడంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు.