Cyclone Michaung: బాపట్ల దగ్గర తీరం దాటిన మిచౌంగ్ తుఫాన్
Cyclone Michaung: విశాఖలో నిలిచిపోయిన పలు విమాన సర్వీసులు
Cyclone Michaung: మిచౌంగ్ తుపాను తీరం దాటింది. బాపట్ల సమీపంలో తుపాను తీరం దాటడంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరం వెంబడి అలలు ఎగసిపడుతున్నాయి. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తీవ్ర తుపానుగా ఉన్న మిచౌంగ్ తుపాను.. సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే తుపాను ప్రభావం తగ్గినా.. వర్షాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తుపాను ప్రభావంతో.. కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.