Cyclone Alert: ఏపీకి తుఫాన్ హెచ్చరిక..ఈ 6 జిల్లాల్లో అతి భారీ వర్షాలు..ప్రభుత్వం అలర్ట్
Cyclone Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత విపత్తు నిర్వహణ బ్రుందాలను అలర్ట్ చేసినట్లు తెలిపారు.
Cyclone Alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం ఉదయం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై తీవ్ర అల్పపీడనంగా మారింది. ఈ లోతైన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో పయనించి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడింది. పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ ఈశాన్య, పుదుచ్చేరి, దక్షిణ ఏపీ తీరాలవైపు వెళ్లే ఛాన్స్ ఉంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హోంమంత్రి వంగలపూడి అనిత విపత్తు నిర్వహణ బ్రుందాలను అప్రమత్తం చేసినట్లుగా వెల్లడించారు.
భారీ వర్ష హెచ్చరికల నేపథ్యంలో చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, ఒంగోలు, కడప జిల్లాల్లో ఇప్పటికే గంట గంటకు వర్షపాతాన్ని తెలుసుకుంటున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన విధంగా రక్షణ కల్పించే చర్యలు తీసుకుంటున్నట్లు హోంమంత్రి తెలిపారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు ఉదయం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై తీవ్ర అల్పపీడనం మారింది. ఈ లోతైన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో పయనించి , నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడింది.
పశ్చిమ వాయువ్యదిశలో కదులుతూ ఈశాన్య, పుదుచ్చేరి, దక్షిణ ఏపీ తీరాల వైపు వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అలర్ట్ అయ్యింది ఏపీ సర్కార్.
ఇక దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హోంమంత్రి వంగలపూడి అనిత అన్నీ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించి వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. విపత్తు నిర్వహణ బృందాలను అప్రమత్తం చేసినట్లుగా చెప్పారు.
భారీ వర్ష హెచ్చరికల నేపథ్యంలో సెల్ నెంబర్ (9032384168) జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆఫీసులను సమన్వయం చేయాలని మంత్రి ఆదేశించినట్లు తెలిపారు.